e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News బెంగాల్‌ పోరు : కాల్పుల ఘటనలో బాధ్యులపై చర్యలు తప్పవన్న దీదీ

బెంగాల్‌ పోరు : కాల్పుల ఘటనలో బాధ్యులపై చర్యలు తప్పవన్న దీదీ

బెంగాల్‌ పోరు : కాల్పుల ఘటనలో బాధ్యులపై చర్యలు తప్పవన్న దీదీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌లో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించిన ఘటన చోటుచేసుకున్న కూచ్‌బెహర్‌ జిల్లా సితాల్‌కుచ్చిలో సీఎం మమతా బెనర్జీ బుధవారం పర్యటించారు. మృతుల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించిన అనంతరం ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులతో తాను మాట్లాడానని ఇప్పుడు వారంతా తన సొంత కుటుంబ సభ్యులేనని అన్నారు.

ఈ ఘటనకు కారకులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. బుల్లెట్స్‌కు తాను బ్యాలెట్లతోనే బదులిస్తానని దీదీ వ్యాఖ్యానించారు.కూచ్‌బెహర్‌ హింసాకాండపై పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీలు పరస్పర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇక ఏప్రిల్‌ 11నే దీదీ కూచ్‌బెహర్‌ జిల్లాను సందర్శించి మృతుల కుటుంబసభ్యులను కలవాల్సి ఉండగా 72 గంటల వరకూ జిల్లాలో బయటి నుంచి వచ్చే రాజకీయ నేతల పర్యటనలపై ఈసీ నిషేధం విధించడంతో ఆమె పర్యటన వాయిదా పడింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బెంగాల్‌ పోరు : కాల్పుల ఘటనలో బాధ్యులపై చర్యలు తప్పవన్న దీదీ

ట్రెండింగ్‌

Advertisement