ముంబై : గతవారం నటి షెఫాలీ జరివాలా(Mallika Sherawat) మృతిచెందిన అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మల్లికా షెరావత్ ఓ కీలక్ సూచన చేసింది. కృత్రిమ కాస్మోటిక్స్ వద్దు అని ఆమె పేర్కొన్నది. ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేసింది. సహజమైన రీతిలో అందాన్ని పెంచుకోవాలన్నది. మర్డర్, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, వెల్కమ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో షెరావత్ నటించించింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన వీడియోలో బొటక్స్ చికిత్స వద్దని సూచన చేసింది. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని షెరావత్ తన అభిమానులకు వీడియోలో పేర్కొన్నది.
అందంగా కనిపించేందుకు తానేమీ ఫిల్టర్లు వాడడం లేదని, మేకప్ కూడా లేదని, తన హేయిర్స్ను బ్రష్ చేయడం లేదని, మీకోసం ఈ వీడియో షేర్ చేస్తున్నానని, బోటక్స్ వద్దు అని, కృత్రిమ కాస్మటిక్ ఫిల్టర్స్ వద్దు అని, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఓకే చెప్పాలని, లవ్ యూ అని ఆమె తన ఇన్స్టా వీడియోలో పేర్కొన్నారు.
గత వారం నటి షెఫాలీ జరివాలా మృతి వివాదాస్పదమైంది. ఆమెకు చావుకు అసలైన కారణం ఇంకా తెలియరాలేదు. జరిమాలాకు గుండెపోటు వచ్చినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఆమె అనూహ్య మరణంతో చర్చ మొదలైంది. కాస్మటిక్స్ ప్రొసిడ్యూర్స్ ను ఆమె తప్పుపట్టారు. యాంటీ ఏజింగ్ చికిత్స విధానాన్ని ఆమె వ్యతిరేకించారు. తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చిందామె. స్వచ్చమైన ఆహారాన్ని తినడం, ద్రవాలను తీసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజతో పాటు కావాల్సినంత నిద్ర పోవాలని మల్లికా షెరావత్ పేర్కొన్నది.