న్యూఢిల్లీ: మాల్దీవుల ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఆ దేశానికి చెందిన 14 ఏండ్ల బాలుడు బలయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని భారత్‌కు చెందిన డోర్నియర్ విమానంలో తరలించేందుకు సిద్ధంగా ఉన్నా అక్కడి ప్రభుత్వవర్గాల నుంచి సమయానికి అనుమతిరాక, బాలుడికి సకాలంలో వైద్యం అందక చనిపోయాడు. అక్కడి మీడియా కథనాల ప్రకారం.. విల్మింగ్టన్ అనే దీవిలో బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 14 బాలుడికి ఈ నెల 17న స్ట్రోక్ వచ్చింది. అతడి సమీప దవా ఖానకు తీసుకెళ్లగా, దేశ రాజధాని మా లెకు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. బాలుడి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు భారత్‌కు చెందిన డోర్నియర్ విమానం బాలుడిని తరలించడానికి సిద్ధమైనప్పటికీ అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎట్టకేలకు మరుసటి రోజు ఆ దేశ వైమానిక దళమే బాలుడిని మాలెకు తరలించింది. విలువైన 16 గంటల సమయం వృథా కావడంతో ఐసీయూలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ బాలుడి ప్రాణాలు దక్కలేదు.