న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మరణాలకు కారణమవుతున్న అల్జీమర్స్, పార్కిన్సన్, వెన్నెముక గాయాలకు సైంటిస్టులు సరికొత్త చికిత్సను కనుగొన్నారు. అంతరిక్షంలోని ల్యాబ్లో అభివృద్ధి చేసిన ‘మినీ బ్రెయిన్స్’ నాడీ సంబంధమైన అనేక వ్యాధులకు పరిష్కారం చూపుతాయని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ ‘ఆక్సానిస్ థెరపాటిక్స్’ ఒక సరికొత్త వైద్య చికిత్సను అభివృద్ధి చేసింది.
తాము కనుగొన్న కొత్త పద్ధతిని ఎలుకలపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చినట్టు కంపెనీ తెలిపింది. ల్యాబ్లో తయారుచేసిన మెదడును పోలిన సూక్ష్మ అవయవాలను (మినీ బ్రెయిన్స్) ‘బ్రెయిన్ ఆర్గనాయిడ్స్’ కూడా పేర్కొంటారు. వీటి తయారీ భూమిపై కొన్ని నెలల సమయ ం పడితుంది. అంతరిక్షంలోని ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం’లో కేవలం 72 గంటల్లో వీటిని తయారుచేసినట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఆర్గనాయిడ్స్ను ల్యాబ్లో సైంటిస్టులు మూల కణాల నుంచి కృత్రిమ పద్ధతుల్లో తయారుచేస్తారు. ఇవి మనిషి మెదడు నిర్మాణాన్ని, పనితీరును పోలి ఉంటాయి.