SIR | ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా
SIR | బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలంటూ ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
SIR | బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలంటూ ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలను ఆమె సవాల్ చేశారు. రాజ్యాంగంలోని పలు నిబంధనలు ఉల్లంఘిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) జరుగుతోందని.. జూన్ 24న ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని ఆమె పిటిషన్లో అభ్యర్థించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దాఖలు రిట్ పిటిషన్ దాఖలు చేరసినట్లు పేర్కొన్నారు. బిహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ జరుగుతోందని.. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)(A), 21, 325, 328, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 ఎన్నికల నమోదు నియమాలు, 1960లోని నిబంధనలను ఉల్లంఘించినట్లేనన్నారు.
ఈ ఉత్తర్వులను రద్దు చేయకపోతే దేశంలో పెద్ద సంఖ్యలో అర్హులైన ఓటర్లు తమ ఓటుహక్కును కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను దెబ్బతిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్‌తో పాటు బెంగాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయడాన్ని నిలిపివేయాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని మహువా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తొలిసారిగా ఓటర్ల జాబితాలో ఇప్పటికే పేర్లు ఉన్నా.. గతంలో అనేకసార్లు ఓటు వేసిన ఓటర్లంతా తమ అర్హతను నిరూపించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంటుందని.. ఇది ఆర్టికల్ 326కి విరుద్ధమని పేర్కొన్నారు. ఆమె తరఫున న్యాయవాది నేహా రతి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను సవాల్ చేస్తూ ఏడీఆర్ సైతం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

