న్యూఢిల్లీ, నవంబర్ 1: పార్లమెంట్లో ప్రశ్నలడగడానికి లంచం తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా గురించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె పార్లమెంటరీ అకౌంట్ దుబాయ్ నుంచి 47 సార్లు లాగిన్ అయినట్టు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా, లంచం ఆరోపణలపై లోక్సభ ఎథిక్స్ కమిటీ ముందు ఆమె గురువారం హాజరు కానున్న క్రమంలో ఈ కథనాలు రావడం విశేషం. ప్రముఖ వ్యాపార వేత్త దర్శన్ హీరానందనికి లబ్ధి చేకూర్చేందుకు ఆమె పార్లమెంట్లో ప్రశ్నలు వేసేవారని, దానికి ప్రతిఫలంగా ఆమె ఆయన నుంచి పెద్దయెత్తున బహుమతులు తీసుకునే వారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.