ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు జరిగాయి. (Polling booth vandalised) బీడ్ జిల్లాలోని పర్లి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ ధ్వంసమైంది. పోలింగ్ బూత్‌లోని ఈవీఎం మిషన్లు, టేబుల్స్, ఇతర సామగ్రి నేలపై పడ్డాయి. దీంతో అక్కడ కొంతసేపు ఓటింగ్ నిలిచిపోయింది. ఘట్నందూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అయితే పోలింగ్ బూత్ ధ్వంసానికి కారణం ఏమిటన్నది తెలియలేదు.
కాగా, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్సీ)కి చెందిన స్థానిక నేత మాధవ్ జాదవ్‌పై పర్లీ టౌన్‌లోని బ్యాంక్ కాలనీ ప్రాంతంలో దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఘట్నందూరు గ్రామంలోని పోలింగ్ బూత్‌ను కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే అధికారంలో ఉన్న మహాయుతి కూటమి కార్యకర్తల దూకుడు కారణంగా ఈ పోలింగ్ బూత్ వద్ద గొడవ జరిగిందని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఆరోపించింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు తోసుకోవడం వల్ల ఈవీఎం మిషన్లు, టేబుల్స్, ఇతర సామగ్రి నేలపై పడ్డాయని విమర్శించింది.
మరోవైపు ఈ పోలింగ్ బూత్‌లో ధ్వంసమైన ఈవీఎంల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసినట్లు బీడ్ కలెక్టర్ అవినాష్ పాఠక్ తెలిపారు. కొంతసేపటి తర్వాత ఓటింగ్ తిరిగి కొనసాగిందని చెప్పారు. పోలింగ్ బూత్ వద్ద పరిస్థితిని పోలీసులు అదుపు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రం ధ్వంసానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, నందుర్బార్ నియోజకవర్గంలో ఈవీఎంలలో సాంకేతిక సమస్యల కారణంగా ఓటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసిన తర్వాత పోలింగ్ తిరిగి కొనసాగింది.
Beed, Maharashtra: A scuffle occurred at a polling station in Ghatnandur village, part of the Parli Assembly constituency in Beed. The identity of those responsible for the altercation is not yet known pic.twitter.com/qsxPtDd3Se
— IANS (@ians_india) November 20, 2024