Prithviraj Chavan : మహారాష్ట్ర (Maharastra) మాజీ ముఖ్యమంత్రి (Former CM), కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ (Prithviraj Chavan) కరాద్ సౌత్ (Karad South) అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లిన పృథ్వీరాజ్ చవాన్.. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
కాగా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. మహారాష్ట్రలోని 288 స్థానాలకు ఒకే విడతలో నవంబర్ 20 పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు రాష్ట్రాల్లో ఈ నెల 23న ఓట్లను లెక్కించి, ఫలితాలను వెల్లడించనున్నారు.
మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. మొత్తం ఆరు ప్రధాన పార్టీలు రెండు కూటములుగా ఏర్పడి పోటీపడుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక్కటిగా ఉన్న శివసేన, ఎన్సీపీ పార్టీలు చీలకల వల్ల ఈ సారి రెండేసి పార్టీలుగా మారాయి. ఏక్నాథ్ షిండే శివసేనను, అజిత్‌పవార్ ఎన్సీపీని చీల్చారు.