ఔరంగాబాద్, జూన్ 18: కారు రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ 300 అడుగుల లోయలో పడి యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఔరంగాబాద్‌కు చెందిన శ్వేత దీపక్ సుర్వశీ(23), ఆమె మిత్రుడు సూరజ్ సంజౌ మూలే(25) సోమవారం మధ్యాహ్నం దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించడానికి కారులో సులిభంజన్ హిల్స్ చేరుకొన్నారు. శ్వేత కారును రివర్స్ చేస్తుండగా.. సూరజ్ వీడియో తీస్తున్నాడు. కారు వేగంగా వెనక్కి వెళ్లడాన్ని గమనించిన సూరజ్.. క్లచ్ వేయాలని గట్టిగా అరిచినా ఫలితం లేకపోయింది. శ్వేతను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే కారు లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.