ముంబై, ఆగస్టు 28( నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని విరార్‌లో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 17కి పెరిగింది. రాత్రిపూట కొనసాగిన సహాయక చర్యలో మరో మూడు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
ముంబయిని ఆనుకుని ఉన్న పాల్ఘర్ విరార్ ప్రాంతంలోని విజయ్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి 12.05 గంటలకు సుమారు 50 ఫ్లాట్లతో కూడిన నాలుగు అంతస్తుల రమాబాయి అపార్ట్ మెంట్, పకనే ఉన్న ఖాళీ ఇంటిపై కూలిపోయిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. భవనం బిల్డర్ నీలే సానేను పోలీసులు అరెస్టు చేశారు.