ముంబై: కోట్లతో నిర్మించిన రోడ్డు మూడు నెలల్లో గుంతలమయంగా మారింది. ఆ రోడ్డు మధ్యలో 10 అడుగుల కంటే ఎక్కువ లోతైన గుంత ఏర్పడింది. కాంట్రాక్టర్కు చెందిన ఒక లారీ ఆ గుంతలో ఇరుక్కుపోయింది. నాసిరకం సామగ్రి, అస్తవ్యస్తమైన నిర్మాణ పనులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. (Road Caves In) మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దహను సమీపంలోని 15.5 కిలోమీటర్ల పొడవైన ‘సరని-ఉర్సే-ఐనా’ రహదారిని ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రూ.18 కోట్లతో నిర్మించారు. అయితే మూడు నెలల్లోనే ఆ రోడ్డుపై భారీ గంతలు ఏర్పడ్డాయి. 10 అడుగుల కంటే ఎక్కువ లోతైన గుంత కూడా ఏర్పడింది. కాంట్రాక్టర్కు చెందిన ఒక లారీ అందులో ఇరుక్కుపోయింది.
కాగా, నిర్మాణం పూర్తయిన కేవలం మూడు నెలలకే రోడ్డు గుంతలమయంగా మారడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విక్రమ్గఢ్కు చెందిన ‘జిజావు కన్స్ట్రక్షన్ కంపెనీ’ ఈ రోడ్డును నిర్మించినట్లు తెలిపారు. అయితే నాసిరకం సామగ్రి, అస్తవ్యస్తమైన నిర్మాణ పనుల కారణంగానే కేవలం మూడు నెలల్లోనే ఈ రోడ్డు పాడైపోయిందని స్థానికులు ఆరోపించారు.
మరోవైపు నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడే రోడ్డు నాణ్యత గురించి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు విమర్శించారు. ఈ రోడ్డు నిర్మాణ పనులపై విచారణ జరుపాలని, కాంట్రాక్టర్, సంబంధిత అధికారులతో సహా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.