ముంబై: వీకెండ్ వల్ల మహారాష్ట్రలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో 33,470 మందికి పాజటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక్క ముంబైలోనే 13,648 కరోనా కేసులు నమోదయ్యాయి. వాణిజ్య నగరంలో యాక్టివ్ కేసులు 1,03,862కు చేరగా, ఆసుపత్రుల్లో రోగుల అడ్మిట్ 21 శాతానికి పెరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,06,046గా ఉన్నది. 12,46,729 మంది హోమ్ ఐసొలేషన్‌లో, 2,505 మంది క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. గత 24 గంటల్లో 66,02,103 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కాగా, మహారాష్ట్రలో ఒమిక్రాన్ కూడా విజృంభిస్తున్నది. సోమవారం కొత్తగా 31 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,247కు పెరిగింది. ఒక్క ముంబైలోనే 606 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోవైపు గత 24 గంటల్లో కరోనాతో 8 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,41,647కు చేరింది.