Guillain-Barre Syndrome | గులియన్-బారే సిండ్రోమ్‌తో ఒకరు మృతి.. మహారాష్ట్రలో తొలి మరణం
Guillain-Barre Syndrome | గులియన్-బారే సిండ్రోమ్ కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. దీంతో ఈ వ్యాధికి సంబంధించి మహారాష్ట్రలో తొలి మరణం నమోదైంది. ఆ రాష్ట్రంలో గులియన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసుల సంఖ్య పెరుగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
ముంబై: గులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barre Syndrome) కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. దీంతో ఈ వ్యాధికి సంబంధించి మహారాష్ట్రలో తొలి మరణం నమోదైంది. ఆ రాష్ట్రంలో గులియన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసుల సంఖ్య పెరుగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. పూణేకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ కొన్ని రోజులుగా విరేచనాలతో బాధపడుతున్నాడు. ఇటీవల అతడు సోలాపూర్ జిల్లాలోని తన సొంతూరుకు వెళ్ళాడు. నిరసంగా ఉండటంతో సోలాపూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు.
కాగా, ఆ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా గులియన్-బారే సిండ్రోమ్ వ్యాధి బారినపడినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ వ్యక్తికి ఐసీయూలో చికిత్స అందించారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో శనివారం ఐసీయూ నుంచి వార్డులోకి తరలించారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన ఆ వ్యక్తి అదే రోజున మరణించినట్లు అతడి బంధువులు తెలిపారు.
గులియన్ -బారే సిండ్రోమ్ అనేది అరుదైన రోగ నిరోధక నరాల వ్యాధి. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది. దీంతో ఆకస్మికంగా తిమ్మిరి, కండరాల బలహీనత ఏర్పడుతుంది. అతిసారం, కడుపు నొప్పి, జ్వరం, వికారం లేదా వాంతులు వంటి లక్షణాలుంటాయి.
మరోవైపు పూణేలో 73 మందికి ఈ వ్యాధి సోకింది. వీరిలో14 మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్కరోజే 9 మందికి ఈ వ్యాధి నిర్ధారణ అయ్యింది. అలాగే మహారాష్ట్రలో తొలి మరణం కూడా నమోదు కావడంతో పూణే అధికారులు అలెర్ట్ అయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
Ramayana | రామాయణకు భారీ స్పందన.. ఒక్కరోజులోనే 36 వేలకి పెరిగిన అడ్వాన్స్ బుకింగ్స్!
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

