ముంబై : మహారాష్ట్రలో కొవిడ్-19 కేసుల పెరుగుదల నేపధ్యంలో రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి ఢిల్లీ వాసులే కారణమని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి నాగపూర్‌కు వలస వచ్చిన వారితోనే వైరస్ వ్యాప్తి చెందిందని వ్యాఖ్యానించారు.
కొవిడ్ కేసుల పెరుగుదలకు చెక్ పెట్టేందుకు ఎయిర్‌పోర్ట్‌లో ఇన్ఫెక్షన్కు గురైన వారిని గుర్తించడం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టెస్టింగ్‌ను ముమ్మరంగా చేపడుతున్నామని మంత్రి చెప్పారు. నాగపూర్‌లో కరోనా కేసుల వ్యాప్తికి ఢిల్లీ నుంచి వలస కూలీలు రావడమేనని అన్నారు.
ఈరోజు బయటపడిన 35 కేసుల్లో ఎక్కువ మంది ఢిల్లీ నుంచి వచ్చిన వారే ఉన్నారని చెప్పారు. అసలు ఎయిర్పోర్ట్ నుంచే టెస్టింగ్ ప్రారంభం కావాలని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించాలని నితిన్ రౌత్ పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడులో కరోనా వ్యాప్తికి ఉత్తరాది విద్యార్ధులే కారణమని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ గత వారం వ్యాఖ్యానించారు.