జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి..
వ్యాయామం చేస్తూ 67 ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ ఘటన పల్గర్ జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Maharashtra | వ్యాయామం చేస్తూ 67 ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ ఘటన పల్గర్ జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రహ్లాద్ నికమ్ (67) అనే వ్యక్తి రోజూ సాయంత్రం తన ఇంటికి సమీపంలోని జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంటారు. రోజూలాగే బుధవారం సాయంత్రం 7.30గంటల ప్రాంతంలో వ్యాయామం చేస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. జిమ్ నిర్వాహకులు ప్రహ్లాద్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, ప్రహ్లాద్ మృతికిగల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- gym
- Maharashtra
- Palghar
- workouts
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

