ముంబై : శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు వంటి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించినపుడు అధికారులు గౌరవప్రదంగా ప్రవర్తించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వచ్చినపుడు అధికారులు తమ కుర్చీల నుంచి లేచి, మర్యాదపూర్వకమైన భాషలో మాట్లాడాలని, వారు చెప్పే అంశాలను సావధానంగా వినాలని తెలిపింది. వారితో ఫోన్ సంభాషణలు కూడా మర్యాదగా, గౌరవప్రదంగా ఉండాలని పేర్కొంది.