Road Accident | మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో కారు-మోటార్ సైకిల్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. దిండోరి పట్టణం సమీపంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. వాణి-దిండోరి రోడ్డులోని నర్సరీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత రెండు వాహనాలు రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోయాయని.. ఆ తర్వాత వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.