మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 20:33:08

మాది రిక్షా ప్ర‌భుత్వ‌మే.. స్టీరింగ్ నా చేతుల్లోనే: ఉద్ధ‌వ్ ఠాక్రే

మాది రిక్షా ప్ర‌భుత్వ‌మే.. స్టీరింగ్ నా చేతుల్లోనే: ఉద్ధ‌వ్ ఠాక్రే

ముంబై: మ‌హారాష్ట్ర‌లోని త‌మ ప్ర‌భుత్వం మూడు చ‌క్రాల రిక్షా వంటిద‌ని, అయితే స్టీరింగ్ త‌న చేతుల్లోనే ఉన్న‌ద‌ని సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే తెలిపారు. ప్ర‌తిప‌క్ష బీజేపీకి ద‌మ్ముంటే త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. ఉద్ధ‌వ్ ఠాక్రే సోమ‌వారం 60వ ఏట అడుగుపెడుతున్నారు. అయితే క‌రోనా నేప‌థ్యంలో పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు చెప్పారు. మ‌రోవైపు శివ‌సేన అధ్య‌క్షుడైన ఉద్ధ‌వ్ త‌న పార్టీ అధికార ప్ర‌తిక సామ్నా‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ చివ‌రి భాగం ఆదివారం ప్ర‌చురిత‌మైంది. ప్ర‌తిప‌క్ష బీజేపీపై ఇందులో ఆయ‌న మండిప‌డ్డారు. త‌మ ప్ర‌భుత్వ భ‌విష్య‌త్తు ప్ర‌తిప‌క్షాల చేతుల్లో లేద‌ని స్ప‌ష్టం చేశారు. 

మ‌హారాష్ట్ర‌లోని మ‌హావికాస్ అఘాది ప్ర‌భుత్వాన్ని మూడు చ‌క్రాల రిక్షాతో పోల్చిన బీజేపీ మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌కు ఉద్ధవ్ గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు. "మూడు చ‌క్రాల రిక్షా పేద‌ల వాహ‌నం. ఎన్సీపీ, కాంగ్రెస్ వెనుక చ‌క్ర‌లైతే ముందు చ‌క్ర‌మైన శివ‌సేన చేతిలో స్టీరింగ్ ఉంది. నేను చ‌క్క‌గానే ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నాను. మీకు క‌డుపుమంట ఎందుకు.. అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాను పార్టీలు మార‌లేద‌ని, కూట‌మితో పొత్తు మాత్ర‌మే పెట్టుకున్నాన‌ని ఉద్ధ‌వ్ చెప్పారు. గ‌తంలో బీజేపీతో జ‌త‌క‌ట్ట‌డంవ‌ల్ల త‌మ పార్టీలో శూన్య‌త ఏర్ప‌డింద‌న్నారు. సెప్టెంబ‌ర్‌-అక్టోబ‌ర్ వ‌ర‌కు ఆగ‌డం ఎందుకు.. మీకు ద‌మ్ముంటే ఇప్పుడే త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చాల‌ని బీజేపీకి స‌‌వాల్ విసిరారు. 

కొంద‌రు నిర్మాణాత్మ‌కంగా ఉండి సంతోషం పొందితే మ‌రికొంద‌రు ప్ర‌భుత్వాల‌ను కూల్చి ఆనందం పొందుతార‌నిఉద్ధ‌వ్‌ విమ‌ర్శించారు. ప్ర‌జాస్వామ్యానికి విరుద్ధంగా త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డిందంటున్న బీజేపీ, ఇత‌ర రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డం ప్ర‌జాస్వామ్య‌మా అని ప్ర‌శ్నించారు. బుల్లెట్ రైలు కంటే రిక్షానే తాను ఎంచుకుంటాన‌ని ఉద్ధ‌వ్ తెలిపారు. అహ్మ‌దాబాద్ - ముంబై మ‌ధ్య బుల్లెట్ రైలు క‌న్నా ముంబై-నాగ‌పూర్ మ‌ధ్య బుల్లెట్ రైలునే కోరుకుంటాన‌ని చెప్పారు. చైనాతో వ్యాపార ఒప్పందాలపై కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేయాల‌న్నారు. ఆ దేశ సంస్థ‌ల‌తో ఇటీవ‌ల కుదుర్చుకున్న పెట్టుబ‌డుల‌ ఒప్పందాల‌ను నిలిపివేసిన‌ట్లు ఉద్ధ‌వ్ చెప్పారు. భ‌విష్య‌త్తులో చైనా ప్ర‌ధాని భార‌త్ సంద‌ర్శించి అన్ని అనుకూలంగా మారితే ఇప్ప‌టి అవ‌కాశాన్ని కోల్పోయామ‌ని అప్పుడు చింతించి ఏమీ ప్ర‌యోజ‌న‌మ‌ని వ్యాఖ్యానించారు.

 

logo