ముంబై: ఉల్లి రైతుల ఆందోళనకు మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. నష్టపోయిన రైతులకు క్వింటాలుకు రూ.300 రాయితీ ఇస్తున్నట్టు సీఎం షిండే సోమవారం ప్రకటించారు. టోకు మార్కెట్లలో క్వింటాలు ధర రూ.2కి పడిపోవడంతో క్వింటాలుకు రూ.600 పరిహారం ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జాతీయ రహదారులపై ఉల్లిపాయలను పారబోస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతుల నిరసనకు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ సంపూర్ణ మద్దతు తెలిపింది.