ముంబై, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో మరాఠా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న మనోజ్ జరాంగే నిలువనున్నారు. ఆయన తన పార్టీ తరఫున ఏడుగురు అభ్యర్థులను పోటీ చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనున్నారు.
అలాగే మరో ఆరు నియోజకవర్గాల్లో అధికార పార్టీ కూటమి అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా ప్రచారం చేయనున్నారు. మరో 2 నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు మద్దతు ప్రకటించారు. అయితే మనోజ్ జరాంగే పార్టీ ప్రభావం ఎంతమేరకు ఉంటుందోనని అక్కడి రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది.