ముంబై, నవంబర్ 9: ఈ నెల 20న జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ‘మిత్రుల’ బెడద తప్పడం లేదు. పొత్తు ఉన్నప్పటికీ 29 నియోజకవర్గాల్లో ప్రధాన కూటముల మధ్య స్నేహపూర్వక పోటీ కొనసాగుతున్నది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) 21 సీట్లలో ఈ స్నేహపూర్వక పోటీ ఎదుర్కోవడం ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా నాండేడ్ ఉత్తర సీట్‌కు కాంగ్రెస్ నుంచి అబ్దుల్ గఫార్, శివసేన (యూబీటీ) నుంచి సంగీతా పాటిల్ నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు. మహాయుతి కూటమికి కూడా ఆరు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ తప్పలేదు.