ముంబాయి : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ( Ajit Pawar ) కు చెందిన విమానానికి ప్రమాదం ( Plane Crashes ) జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు బుధవారం ఉదయం 8.30 గంటలకు చార్టెడ్ విమానం బారమతిలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. దీంతో విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడంతో అగ్నిమాపక అధికారులు ఘటన స్థలికి చేరుకుని సహాయచర్యలు ప్రారంభించారు.
నిన్న ముంబాయిలో జరిగిన మహారాష్ట్ర క్యాబినేట్ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బారమతిలో బుధారం ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బారమతికి రాగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.