Maharastra : రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని మహారాష్ట్రకు బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా వచ్చిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి విజయ్ రూపానీ తెలిపారు. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులుగా శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆయన వెల్లడించారు.
దక్షిణ ముంబైలోని అజాద్ మైదాన్‌లో సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకార కార్యక్రమాలు జరుగుతాయని రూపానీ అన్నారు. ఇక మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై మహాయుతి కూటమిలోని మూడు పార్టీలు సమావేశమై త్వరలో నిర్ణయం తీసుకుంటాయని ఆయన చెప్పారు. అదేవిధంగా మూడు పార్టీల నేతలు కాపేపట్లో మహారాష్ట్ర గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమ సంసిద్ధతను ప్రకటిస్తాయని తెలిపారు.
కాగా బుధవారం ఉదయం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అందుకుగాను శాసనసభాపక్షంలోని ప్రతి ఒక్కరికీ ఫడ్నవీస్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.