ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) లగేజీని ఎన్నికల కమిషన్ (ఈసీ) అధికారులు తనిఖీ చేశారు. హెలికాప్టర్లో ఆయన వెంట తెచ్చిన సూట్‌కేసులు, బ్యాగులను తెరిచి చెక్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శివసేన అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ హేమంత్ గాడ్సేకు మద్దతుగా ఎన్నికల ప్రచారం కోసం సీఎం ఏక్నాథ్ షిండే గురువారం నాసిక్‌లోని పంచవటికి హెలికాప్టర్లో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈసీ అధికారులు ఆయన లగేజ్‌ను తనిఖీ చేశారు.
కాగా, సీఎం ఏక్నాథ్ షిండే హెలికాప్టర్లలో బ్యాగులు తీసుకెళ్తున్నారని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ సోమవారం ఆరోపించారు. ప్రజల మద్దతు తమకే ఉందని చెప్పుకుంటున్న ఆయనకు ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బు ఎందుకు కావాలి? అని ప్రశ్నించారు. ‘తమ హెలికాప్టర్లను తనిఖీ చేసే సమయం ఎన్నికల అధికారులకు ఉంది, కానీ ఈ వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోరు’ అని ఎక్స్‌లో విమర్శించారు. అలాగే సీఎం షిండే సిబ్బంది హెలికాప్టర్ల నుంచి సూట్‌కేసులు, బ్యాగులు తీసుకెళ్తున్న వీడియో క్లిప్ ఆయన షేర్ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఈసీ అధికారులు సీఎం షిండే లగేజ్‌ను చెక్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Maharashtra CM Eknath Shinde's luggage was checked by Election Commission officers in Panchavati, Nashik. pic.twitter.com/1v1sBkNe4p
— ANI (@ANI) May 16, 2024
मुख्यमंत्री खाऊ घेऊनआलेतोक्षण!
नाशिक मध्ये रात्रीस खेळ चाले. नुसता पै पाऊस…
दोन तासांच्या दौऱ्या साठी इतक्या जड बॅगा पोलिस का वाहातआहेत?
यातून कोणतामाल नासिकला पोहचला?
निवडणूकआयोग फालतू नाकाबंदीआणि झडत्या करत आहे.महाराष्ट्रात अधिकृत बॅगा वाटप सुरुआहे.
@ECISVEEP pic.twitter.com/2gOaPxVeZm— Sanjay Raut (@rautsanjay61) May 13, 2024