టెక్నాలజీ వైద్యుడి అవతారం ఎత్తుతుంది, ఆరోగ్య సలహాలు ఇస్తుంది. గురూజీ
పాత్ర పోషిస్తుంది, ధ్యానం ఏ స్థాయిలో సాగుతున్నదో బేరీజు వేస్తుంది.ఓ ల్యాబ్లానూ పనిచేస్తుంది.శరీరంలోని అవయవాల సమర్థతను బేరీజు వేస్తుంది.
డిప్టిర్ స్ట్రాక్
మారిన జీవన విధానంలో కూర్చొనే భంగిమల ద్వారాకూడా వెన్నునొప్పి వచ్చే ఆస్కారం ఎక్కువని నిపుణులు చెబుతారు. ఈ సమస్యకు పరిష్కారంగా బెంగళూరుకు చెందిన వెల్నెస్ స్టార్టప్ రూపొందించిన కొత్త పరికరం. ‘డిప్టిర్ స్ట్రాక్’. దీనిని వీపు భాగంలో అతికించుకుంటే శరీర భంగిమలను సరిదిద్దడంలో సాయపడుతుంది. దీనిలోని అయస్కాంతాలు, మనం సరైన
భంగిమలో కూర్చోకపోతే, బీప్ బీప్ అంటూ వైబ్రేషన్స్ సృష్టిస్తాయి. ఈ హెచ్చరిక ఆధారంగా భంగిమను మార్చుకోవచ్చు. దీనిలోని ‘కోచ్ మోడ్’ నిరంతరం శరీర భంగిమలను పర్యవేక్షిస్తుంది. ఆ డేటాను గంటలవారీగా, వారాలవారీగా వర్గీకరించి ప్రత్యేక యాప్‌ద్వారా అందిస్తుంది. దీనికి అనుసంధానమైన ఎల్యీడీ ఇండికేటర్‌తో కూడా అనేక ప్రయోజనాలున్నాయి.
బోస్ ఫ్రేమ్
టెంపోస్మార్ట్ సన్ గ్లాసెస్ ఇవి. దీనికి హెడ్‌ఫోన్ అనుసంధానమై ఉంటుంది. బ్లూటూత్ అడ్వాన్స్ ఆడియో డిస్ట్రిబ్యూషన్ ప్రొఫైల్ (A2DP), బ్లూటూత్ హ్యాండ్స్-ఫ్రీ ప్రొఫైల్ (HFP)
సపోర్ట్‌తో దీనిద్వారా ఫోన్‌కాల్స్‌ను లిఫ్ట్ చేసి, మాట్లాడవచ్చు. కుడివైపు టచ్ ఇంటర్‌స్పేస్ ద్వారా సౌండ్ కంట్రోల్ చేసుకోవడానికి ముందుకూ వెనక్కి టచ్ చేస్తే చాలు. ఈ ఆధునిక కండ్లజోడుకు ఇంటిగ్రేటెడ్ స్పీకర్లు ఇన్‌బిల్ట్‌గా వచ్చాయి. 99 శాతం వాటర్‌ప్రూఫ్ ఇది.
నాడీ ఎక్స్
ఫ్యాషన్ టెక్ కంపెనీ రూపొందించిన స్మార్ట్ లెగ్గింగ్ ఇది. యోగా, ఏరోబిక్స్ చేసేటప్పుడు శరీర కదలికలను అంచనా వేస్తుంది. ఈ లెగ్గింగ్లోని సెన్సర్లు అవయవాల పనితీరును ట్రాక్ చేస్తాయి. యోగాకు ఎంతో అనువుగా ఉంటుంది. ప్రతి భంగిమనూ సరిగ్గా చేయడానికి తగిన సూచనలు కూడా ఇస్తుంది. అంతేకాదు, దీనిలోని సెన్సర్లు శరీరంలో కొద్దిపాటి వైబ్రేషన్స్‌ను సృష్టిస్తాయి. ఈ లెగ్గింగ్‌ను వేసుకొన్నప్పుడు శరీరంలో జరిగే ప్రతి కదలికనూ యాప్ నమోదు చేస్తుంది. ఆపిల్, ఆండ్రాయిడ్ వెర్షన్లలో దీనిని రూపొందించారు. అన్ని వయసుల వారికీ అనువైందీ ‘నాడీ ఎక్స్ స్మార్ట్ లెగ్గింగ్’.
మ్యూస్ ఎస్
ఇది బ్రెయిన్ సెన్సింగ్ హెడ్‌బ్యాండ్. ‘మ్యూస్ ఎస్’ను ప్రశాంతమైన ధ్యానం కోసం, సుఖవంతమైన నిద్రకోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీని ఆన్‌బోర్డ్‌లో కొన్ని ప్రత్యేక సెన్సర్లు అమర్చారు. వీటిల్లో ఒకటి ఈఈజీ. ఇది మెదడు కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. రెండోది పీపీజీ. ఇది హృదయ స్పందనలను నమోదు చేస్తుంది. ఇందులోనే పల్స్ ఆక్సిమీటర్ కూడా ఉంటుంది. ఇది నిత్యం ఆక్సిజన్ స్థాయులను పర్యవేక్షిస్తుంది. యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్ వంటివి శరీర కదలికలను అబ్జర్వ్ చేస్తుంటాయి. నిద్ర, మనసు, గుండె, శరీరం,శ్వాస మొదలైనవి
ట్రాక్ చేస్తూ, మీ మానసిక ప్రశాంతతకు ఎంతో దోహదపడుతుంది. అలాగే, వివిధ రకాల మెడిటేషన్ సెషన్లను ఆస్వాదించడానికి వేర్వేరు సౌండ్ స్కేప్లను ఇందులో నిక్షిప్తం చేశారు. ఓ రోజు మొత్తంలో మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారనే అంశంపై ఓ నివేదికను కూడా ఇది ఇస్తుంది.