Devendra Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆదివారం నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులె, రాధాకృష్ణ విఖె పాటిల్, ఎన్సీపీ నేత హసన్ ముష్రిఫ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఫడ్నవీస్ క్యాబినెట్ మంత్రులుగా బీజేపీ నేతలు అశీష్ షెలార్, పంకజ్ ముండే, గణేష్ నాయక్, గిరిష్ మహాజన్ తదితరులు ప్రమాణం చేశారు.
శివసేన ఏక్ నాథ్ షిండే గ్రూప్ నుంచి ఉదయ్ సామంత్, గులాబ్ రావు పాటిల్, దాదాజీ భుసే, సంజయ్ రాథోడ్, సంజయ్ శిర్సాత్, భరత్ గొగావాలె, ఎన్సీపీ నుంచి హసన్ ముష్రిఫ్, ధనుంజయ్ ముండే, దత్తాత్రే భార్నె, అదితి తాత్కారే, మాణిక్ రావ్ కొకాటే, నరహరి జిర్వాల్ తదితరులు కూడా మహారాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేయించారు. మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలోకి కొత్త ముఖాలకు చోటు కల్పిస్తారని తెలుస్తున్నది. మంత్రులుగా సరిగ్గా పని చేయని వారిని ఏక్ నాథ్ షిండే గ్రూప్ నుంచి నలుగురు, బీజేపీ నుంచి ముగ్గురు, అజిత్ పవార్ గ్రూప్ నుంచి ఇద్దరిని తప్పిస్తారని సమాచారం. అంతకు ముందు మహారాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించారని సమాచారం.