
ముంబై, అక్టోబర్ 11: లఖింపూర్ ఖీరీ హింసాత్మక ఘటనలను నిరసిస్తూ మహారాష్ట్రలోని అధికార పక్షం ‘మహావికాస్ అఘాదీ’ (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్) నేతృత్వంలో సోమవారం జరిగిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి సంఘీభావాన్ని తెలియజేశారు.
మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఆశిష్
లఖింపూర్ కేసుకు సంబంధించి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపుతూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. పోలీసుల విచారణ సమయంలో ఆశిష్తో పాటు అతని న్యాయవాది కూడా ఉండవచ్చని పేర్కొంది.