థానే, ఆగస్టు 28 : ఒక ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలోని వంటమనిషి 22 మంది బాలికలను లైంగికంగా వేధించిన ఘటన బీజేపీ పాలిత మహారాష్ట్రలోని థానేలో వెలుగుచూసింది. అతడు పోక్సో కేసులో గతంలో జైలు శిక్ష అనుభవించాడని అధికారులు శుక్రవారం తెలిపారు. థానే జిల్లా షాహ్పూర్లోని తెంబాలో ఒక ప్రభుత్వ అశ్రమ పాఠశాలలో నిందితుడు గణపత్ గవ్లీ వంటవాడిగా పనిచేస్తున్నాడు.
10 నెలల్లో ఉద్యోగ విరమణ చేయబోతున్న గవ్లీకి బాలికలను వేధించడం అలవాటు. పాఠశాలలోని బాలికలను సైతం వేధించేవాడు దీంతో ఈ నెల 24న బాలికలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై చర్య తీసుకోవాలని వారు ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. ఆయన వెంటనే దీనిపై గిరిజన అభివృద్ధి శాఖకు లేఖ రాశారు. దీంతో నిందితుడిపై షాహ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు పాఠశాలలో విచారించగా, 17, 18 మంది బాలికలు అతని అకృత్యాల గురించి వెల్లడించడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.