Bomb Threat | రాజస్థాన్ హనుమాన్‌గఢ్ రైల్వేస్టేషన్లో ఓ లేఖ దొరికింది. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇందులో ఉజ్జయిని మహాకాల్ ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలను పేల్చివేస్తామని బెదిరించారు. లేఖలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పేరును ఉన్నది. ఈ క్రమంలో ఉజ్జయిని పోలీసులు అప్రత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. హనుమాన్‌గఢ్ రైల్వేస్టేషన్ మాస్టర్‌కు నవంబర్ 2న ఉజ్జయిని మహాకాల్ ఆలయాన్ని పేల్చేస్తామని బెదిరింపు లేఖ అందిందని.. దాంతో పాటు జైపూర్, ఉదయ్‌పూర్, బుండి స్టేషన్లు పేల్చివేస్తామని అందులో పేర్కొన్నట్లు సమాచారం.
కోట, బికనీర్, జోధ్‌పూర్, హనుమాన్‌గఢ్, గంగానగర్ రైల్వే స్టేషన్లను బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తున్నది. హనుమాన్‌ఘఢ్ స్టేషన్ మాస్టర్‌కు పోస్ట్ ద్వారా బెదిరింపు లేఖ వచ్చిందని సమాచారం. దాంతో ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దాంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు. బెదిరింపులతో భద్రతను కట్టుదిట్టం చేశామని ఎస్పీ ప్రదీప్ తెలిపారు. బాంబు స్క్వాడ్ బృందం ప్రతిరోజూ మహకాల్ ఆలయాన్ని తనిఖీ చేస్తున్నప్పటికీ.. ఆలయ ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా ఉన్నామన్నారు.