Jaya Bachchan | తొక్కిసలాట మృతదేహాలను నదిలో పడేశారు.. కుంభమేళా నీరు కలుషితంగా మారింది: జయా బచ్చన్
Jaya Bachchan | బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారని ఆరోపించారు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ (Jaya Bachchan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారని ఆరోపించారు. దీంతో కుంభమేళ నీరు కలుషితమైందని విమర్శించారు. సోమవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో జయా బచ్చన్ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడ్డారు. సామాన్య ప్రజల కోసం కుంభమేళాలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. ‘ప్రస్తుతం అత్యంత కలుషితమైన నీరు ఎక్కడ ఉంది? అది కుంభమేళాలో ఉంది. తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పారేశారు. దీని కారణంగా నీరు కలుషితమైంది. అసలు సమస్యలను పరిష్కరించడం లేదు. కుంభమేళాను సందర్శించే సామాన్యులకు ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదు. వారికి ఎలాంటి ఏర్పాట్లు లేవు’ అని అన్నారు.
కాగా, జనవరి 29న కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించగా 60 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టిందని ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ విమర్శించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించలేదని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వడం లేదని, పూర్తిగా కంటితుడుపు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ నీరు, జలశక్తిపై ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పార్లమెంట్లో విమర్శించారు. కుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారి వాస్తవ సంఖ్యను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాచిందని ఆరోపించారు. దీనిపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు.
#WATCH | Delhi: Samajwadi Party MP Jaya Bachchan says, “… Where is the water most contaminated right now? It’s in Kumbh. Bodies (of those who died in the stampede) have been thrown in the river because of which the water has been contaminated… The real issues are not being… pic.twitter.com/9EWM2OUCJj
— ANI (@ANI) February 3, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

