Karur Stampede : కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో టీవీకే పార్టీ (TVK party) నేతకు బెయిల్ ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు (Madras High Court) నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ టీవీకే నామక్కల్ జిల్లా కార్యదర్శి సతీష్‌కుమార్ (Satish Kumar) దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ర్యాలీ సమయంలో జన సమూహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని కోర్టు ప్రశ్నించింది.
ఇదిలావుంటే తొక్కిసలాట బాధితులకు అదనపు పరిహారం కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. పరిహారం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మీ స్పందన తెలియజేయాలని ఆదేశిస్తూ కోర్టు.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇటీవల విజయ్ ప్రచార ర్యాలీ సందర్భంగా కరూర్‌లో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.