భోపాల్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి (Covid-19) పూర్తిగా అదుపులోకి వచ్చిందని, ఇకపై ఎలాంటి ఆంక్షలు (Covid Restriction) ఉండవని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సంబంధిత అన్నిరకాల ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నామని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ (CM Shivraj Singh Chouhan) స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు సామాజిక, రాజకీయ, క్రీడా, వినోదం, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలను ఎప్పటిలాగే నిర్వహించుకోవచ్చని చెప్పారు.
అయితే ప్రభుత్వ ఉద్యోగులు, దుకాణదారులు, పనిచేసేవారు, సినిమా థియేటర్ల ఉద్యోగులు తప్పనిసరిగా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని స్పష్టం చేశారు. ఇక సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు కనీసం ఒక్క డోసైనా తీసుకొని ఉండాలన్నారు.