భోపాల్: కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్ పుస్తకాన్ని బుధవారం రిలీజ్ చేశారు. అయితే ఆ బుక్‌లో హిందుత్వ వాదాన్ని.. ఇస్లామిక్ తీవ్రవాదంతో పోల్చారు. ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులు ఐఎస్, బోకోహరమ్ తరహాలో హిందుత్వ వాదం ఉన్నట్లు ఖర్షీద్ తన పుస్తకంలో రాశారు. దీనిపట్ల బీజేపీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. హిందువులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ ఓ గూడు అల్లుతోందని బీజేపీ ఆరోపించింది. ఖుర్షీద్పై ఢిల్లీ పోలీసుల వద్ద ఓ లాయర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు హిందుత్వపై దాడులు జరుగుతున్నట్లు బీజేపీ ఆరోపించింది. ఖుర్షీద్‌ను కాంగ్రస్ పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఖుర్షీద్ రాసిన పుస్తకంపై నిషేధం విధించనున్నట్లు మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత, ఆ పుస్తకాన్ని నిషేధిస్తామన్నారు.