భోపాల్: ఇటీవల విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్’సినిమా చూసేందుకు పోలీసులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సెలవు ఇవ్వనుంది. హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాపై వినోదపు పన్ను నుంచి 100 శాతం మినహాయింపు ఇస్తున్నట్టు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఈ సినిమాను చూశారు. కర్ణాటకలో కూడా వంద శాతం పన్ను రాయితీ ఇస్తున్నట్టు వెల్లడించారు. రోజూ ఒక్క షో ప్రజలు చూసేందుకు డబ్బులు ఇస్తానని కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ పేర్కొన్నారు. త్రిపుర, గోవాలో కూడా ఈ సినిమాకు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు.