Watch: మొబైల్ ఫోన్లో రికార్డ్ చేయడంపై పోలీస్ ఆగ్రహం.. ఒక వ్యక్తిని దారుణంగా కొట్టిన వైనం
పోలీస్ ఇన్స్పెక్టర్ అభినవ్ రాయ్, ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిపై పంచ్‌లు ఇచ్చాడు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్నప్పటికీ అతడ్ని కొట్టడం ఆపలేదు.
భోపాల్: ఒక వ్యక్తి మొబైల్ ఫోన్లో తనను రికార్డ్ చేయడంపై పోలీస్ అధికారి ఆగ్రహించాడు. అంతా చూస్తుండగా ఆ వ్యక్తిని దారుణంగా కొట్టాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక కుటుంబం చనిపోయిన తమ బంధువు అంత్యక్రియల కోసం మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌కు కారులో వచ్చారు. చెక్‌పాయింట్ వద్ద ఉన్న పోలీసులు కారును ఆపాలని చెప్పారు. అయితే వేగంగా వెళ్తున్న ఆ కారు చెక్‌పాయింట్ దాటిన తర్వాత ఆగింది. పోలీస్ అధికారులు ఆ కారు వద్దకు వచ్చి పత్రాలను తనిఖీ చేశారు. పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోవడంపై చలానా రాయసాగారు. దీంతో ఆ కారును నడుపుతున్న వ్యక్తి దీనిని తన మొబైల్లో రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడు.
కాగా, ఇది చూసిన పోలీస్ ఇన్స్పెక్టర్ అభినవ్ రాయ్, ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిపై పంచ్‌లు ఇచ్చాడు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్నప్పటికీ అతడ్ని కొట్టడం ఆపలేదు. మరోవైపు ఆ సమయంలో అక్కడున్న వారు మొబైల్లో రికార్డు చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు ఈ సంఘటనపై స్పందించారు. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ వద్ద రాజీపడ్డారని, ఈ వివాదం ముగిసిందని తెలిపారు.
Shahdol, Madhya Pradesh
वाहन चेकिंग के दौरान सूबेदार अभिनव राय ने कार सवार युवक को रोका। जब युवक और उसके परिवार वाले वीडियो बनाने लगे तो यह सूबेदार साहब को अपनी शान में गुस्ताखी लगी।
जब सब कुछ कानून के दायरे में कर रहे हैं तो फिर वीडीयो बनाने पर एतराज क्यों ? pic.twitter.com/F6uTjM5ubv
— काश/if Kakvi (@KashifKakvi) February 5, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

