జబల్పూర్, మే 2: మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన పడవ ప్రమాదానికి సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నది. నిబంధనల ప్రకారం ప్రయాణికులు బోటులోకి ఎక్కగానే ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్లు అందజేసి, వాటిని ధరించమని అందులోని సిబ్బంది చెప్పాలి. కానీ ఈ బోటులోకి నీళ్లు వస్తున్న సమయంలో సిబ్బంది లైఫ్ జాకెట్ల మూటను విప్పుతున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
అప్పటికే ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేయడం ఆ వీడియోలో కనిపించింది. పడవ భారీ కుదుపులకు గురైనప్పుడు కానీ సిబ్బంది స్పందించలేదు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మృతుల సంఖ్య పెరిగిందని ప్రమాదం నుంచి బయటపడిన వారు ఆరోపించారు.