భోపాల్, అక్టోబర్ 15: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 144 మంది అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ తొలి జాబితాను ఆదివారం విడుదల చేసింది.
అయితే కాంగ్రెస్ ఇక్కడ తన ‘9’ నంబర్ సెంటిమెంట్‌ను ఫాలో అయింది. అందుకే తొమ్మిది సంఖ్య కలిసొచ్చేలా ‘నవ’రాత్రి ఉత్సవాల మొదటి రోజున జాబితాను విడుదల చేసింది. అలాగే 144 సీట్లకు (1+4+4=9) అభ్యర్థులను ప్రకటించింది. కచ్చితంగా ఉదయం 9 గంటలకు ఈ లిస్టు విడుదల చేసింది.