హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఈ ఘటనలో అయిదుగురు వ్యక్తుల్ని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఏటీఎస్(MP ATS) పోలీసులు మంగళవారం ఉదయం అయిదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు 11 మందిని భోపాల్‌లో అరెస్టు చేశారు. అయితే భోపాల్ వ్యక్తులతో లింకు ఉన్న అయిదుగురు హైదరాబాదీలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వ్యక్తుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. అరెస్టు చేసిన ఆ అయిదుగుర్ని మధ్యప్రదేశ్‌కు తరలించారు.
గత 18 నెలల నుంచి రాడికల్ ఇస్లామిక్ కదలికలపై పోలీసులు నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. అరెస్టు అయిన వారి నుంచి భారీ స్థాయిలో ఇస్లామిక్ జిహదీ సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెయిడ్‌లో కత్తులు, ఎయిర్ గన్స్‌ను కూడా సీజ్ చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఏటీఎస్ మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
ఈ అరెస్టులకు సంబంధించి మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు కేసును రిజిస్టర్ చేయనున్నారు. హైదరాబాద్‌లో అరెస్టు చేసిన వారిని భోపాల్‌కు తరలించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.