తిరువనంతపురం, ఏప్రిల్ 11: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్న వేళ కేరళలోని కాలికట్ నిట్ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం పరిశోధకులు సౌర శక్తితో నడిచే స్మార్ట్ సోలార్ కుక్కర్‌ను తయారు చేశారు. ఇంట్లో, రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాలకు ఇది బాగా ఉపయోగపడుతుందని ప్రొ.అశోక్ చెప్పారు. పగలు సౌర పలకల ద్వారా వంట చేసుకోవచ్చు. రాత్రి వేళ వాడటానికి కుక్కర్లో బ్యాటరీ ఉంటుంది. ఒక వేళ బ్యాటరీ అయిపోతే సాధారణ ఎలక్ట్రిక్ కుక్కర్లాగా కూడా వినియోగించుకోవచ్చు. ఈ స్మార్ట్ సోలార్ కుక్కర్‌పై ఇప్పటికే ట్రయల్స్ నిర్వహించారు.