ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో నిరుద్యోగులతో కిక్కిరిసి కనిపించిన దృశ్యమిది. శనివారం పెట్-2022 జరగగా, పరీక్ష రాసేందుకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఘాజీపూర్, సీతాపూర్ జంక్షన్ల రైల్వేస్టేషన్లు నిండిపోయాయి. అయినా తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో డబుల్ ఇంజిన్ సర్కారుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 37.5 లక్షల మంది నమోదుచేసుకొన్నారు.