Watch: యువతిని కొడవలితో వెంబడించి వ్యక్తి దాడి.. అడ్డుకున్న స్థానికులు
Man Chases | స్కూటీపై వెళ్తున్న యువతిని ఒక వ్యక్తి అడ్డుకున్నాడు. తన వద్ద ఉన్న కొడవలిని బయటకు తీశాడు. దీంతో తప్పించుకునేందుకు ఆ మహిళ పరుగులు తీసింది. వెంబడించిన ఆ వ్యక్తి (Man Chases) ఆమెపై దాడి చేశాడు. గమనించిన స్థానికులు అతి కష్టంమీద అతడ్ని అడ్డుకుని ఆమెను కాపాడారు.
ముంబై: స్కూటీపై వెళ్తున్న యువతిని ఒక వ్యక్తి అడ్డుకున్నాడు. తన వద్ద ఉన్న కొడవలిని బయటకు తీశాడు. దీంతో తప్పించుకునేందుకు ఆ మహిళ పరుగులు తీసింది. వెంబడించిన ఆ వ్యక్తి (Man Chases) ఆమెపై దాడి చేశాడు. గమనించిన స్థానికులు అతి కష్టంమీద అతడ్ని అడ్డుకుని ఆమెను కాపాడారు. ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. స్కూటీ నడుపుతున్న 20 ఏళ్ల ప్రీతి రామచంద్రను మంగళవారం శంతను లక్ష్మణ్ జాదవ్ అనే వ్యక్తి రోడ్డుపై అడ్డుకున్నాడు. తన వద్ద ఉన్న కొడవలిని బయటకు తీసి ఆమెపై దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆ యువతి భయంతో రోడ్డుపై పరుగులు తీసింది. వెంబడించిన అతడు కిందపడిన ఆమెపై కొడవలితో రెండుసార్లు దాడి చేశాడు.
కాగా, కొడవలితో యువతిపై దాడిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. చేతికి అందిన వస్తువులను లక్ష్మణ్ మీదకు విసిరారు. దీంతో అతడు ఆ ఆయుధాన్ని చూపించి స్థానికులను భయపెట్టేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఆ మహిళ పైకి లేచి అక్కడి నుంచి పరుగుపెట్టింది. చివరకు స్థానికులు అతికష్టం మీద లక్ష్మణ్‌ను పట్టుకున్నారు. ఈ విషయం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అతడ్ని అప్పగించారు.
మరోవైపు నిందితుడు లక్ష్మణ్ జాదవ్ కొంత కాలంగా తన కుమార్తెను వేధిస్తున్నాడని ప్రీతి తల్లి ఆరోపించింది. అతడి తండ్రికి కూడా ఈ విషయం చెప్పినట్లు తెలిపింది. అయినప్పటికీ తన కుమార్తెను వేధించడం ఆపలేదని, పైగా ఆమెను చంపేందుకు అతడు ప్రయత్నించినట్లు ఫిర్యాదు చేసింది. అయితే లక్ష్మణ్ దాడిలో ప్రీతికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో చికిత్స తర్వాత ఆమెను డిశ్చార్జ్ అయ్యింది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In Pune, a guy attacked a girl over one sided love, tried to kiII her but people present there interfered, caught that guy & saved the girl.
Salute to Punekars for their efforts! pic.twitter.com/RWH03U0ifJ
— Mr Sinha (@Mrsinha) June 27, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

