Lung Cancer : కలవర పెడుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్.. అత్యధిక కేసులు ఈ రాష్ట్రాల్లోనే
రెండు లక్షల కేసులతో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్
Lung Cancer : దేశవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రెండేళ్లలో లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వాళ్ల సంఖ్య 5 శాతం పెరిగాయని వెల్లడించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం (ఎన్సీఆర్పీ) డేటాలోని వివరాలను పార్లమెంట్లో కేంద్రం ఉటంకించింది. డేటా ప్రకారం..ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా పోయిన ఏడాది 34వేల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ ఏడాది అత్యధికంగా రెండు లక్షల కేసులతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో స్త్రీ, పురుషులు కలిపి 2,10,958 మంది లంగ్ క్యాన్సర్‌తో బాధపడతున్నారు. మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో లంగ్ క్యాన్సర్ కేసులు తమిళనాడులో ఎక్కువ నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ ఉన్నాయి. 40 నుంచి 64 ఏళ్ల మధ్యన ఉన్నవాళ్లలోనే ఈ మహమ్మారి ఎక్కువ కనిపించినట్టు ఐసీఎంఆర్ డేటా చెప్తోంది.
మనదేశంలోని ప్రతి తొమ్మిది మందిలో ఒకరు జీవితకాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని ఐసీఎంఆర్ సంస్థ తెలిపింది. అంతేకాదు ఈ జబ్బు 2025 నాటికి 12.8 శాతానికి పెరిగే అవకాశం ఉందని చెప్పింది. పొగతాగేవాళ్లు లంగ్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ. ఈ మహమ్మారి సోకినవాళ్లలో విపరీతమైన దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీలో నొప్పి వస్తుంది. బరువు తగ్గిపోతారు. తరచూ తలనొప్పి వస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

