లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ (సీసీఎన్)లో చేరింది. దీంతో ఈ నగరానికి గల ఆహార తయారీ కళ (పాక శాస్త్ర కళ) వారసత్వానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భారత దేశంలోని ఐక్య రాజ్య సమితి విభాగం ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో, లక్నో నగరం ఆహారానికి కేంద్రమని తెలిపింది. ఇక్కడ నోరూరించే గలౌటీ కబాబ్, అవధి బిర్యాని, ఛాట్, గోల్గప్పా, మఖన్ మలై వంటి అనేక రుచికరమైన తినుబండారాలు ఉంటాయని పేర్కొంది. శతాబ్దాల నాటి ప్రాచీన సంప్రదాయాలు ఇక్కడ విలసిల్లుతున్నట్లు వివరించింది.