లక్నో: పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తామని లక్నో యూనివర్సిటీ తెలిపింది. (Lucknow University) అలాగే ఉచితంగా వసతి కల్పించడంతోపాటు పాటు పుస్తకాలు కూడా అందజేస్తామని లక్నో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అలోక్ రాయ్ ప్రకటించారు. తమ విద్యా సంస్థలో చదివేందుకు పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల పిల్లలను ఆయన స్వాగతించారు. ‘ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారిపై ఆధారపడిన వారు లక్నో విశ్వవిద్యాలయంలో చదివేందుకు మేం స్వాగతిస్తాం. వారి విద్య, వసతి, పుస్తకాలు మొదలైన ఖర్చును విశ్వవిద్యాలయం భరిస్తుంది’ అని అన్నారు.
కాగా, ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ బైసరన్ గడ్డి మైదానంలో సేద తీరుతున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల వ్యాపారి శుభం ద్వివేది కూడా ఈ ఉగ్రదాడిలో మరణించాడు. ఫిబ్రవరి 12న ఐశన్యతో అతడికి వివాహం జరిగింది. పెళ్లైన రెండు నెలలకే ఉగ్రదాడిలో భర్తను కోల్పోవడంపై ఆమె తీవ్రంగా విలపించింది. ఉగ్రదాడిలో మరణించిన శుభం ద్వివేదికి అమరవీరుడి హోదాను ప్రభుత్వం కల్పించాలని భార్యతోపాటు అతడి కుటుంబం డిమాండ్ చేసింది.
#WATCH | Uttar Pradesh | Lucknow University to provide free education to the dependents of those killed in the April 22 Pahalgam terror attack
Vice Chancellor of Lucknow University, Alok Rai, says, “We will welcome the dependents (of those who were killed in the April 22… pic.twitter.com/jReooBDR6t
— ANI (@ANI) April 30, 2025