లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ జంట బైక్‌పైనే ఫుల్ రొమాన్స్ ఎంజాయ్ చేసింది. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నగరంలోని హజ్రత్‌గంజ్ ఏరియాలో ఆ జంట టూవీలర్‌పై వెళ్తూ ముద్దుల్లో తేలిపోయారు. బైక్ వెనుక నుంచి వస్తున్న మరో వాహనంలో ఉన్న వ్యక్తులు ఆ వీడియో తీశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు ఆ జంట కోసం వెతుకుతున్నారు.
బైక్‌పై రొమాన్స్ వీడియో నగరంలో హజ్రత్‌గంజ్ ఏరియాదే అని లక్నో సెంట్రల్ జోన్ పోలీసులు అపర్ణా రజత్ కౌశిక్ తెలిపారు. జంటను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫూటేజ్ద్వారా వారి కోసం అన్వేషిస్తున్నారు. మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. అసభ్యతను ప్రోత్సహిస్తున్న కోణంలోనూ విచారించనున్నారు.
हज़रतगंज ,लखनऊ…😅
वैसे इसपे कौन सा चालान होगा ?@LkoCp @lkopolice @TOILucknow @Uppolice @uptrafficpolice #Lucknow #bike #Romance pic.twitter.com/a3jQz43DQG— Sachin Mishra (@Sachin0402m) January 17, 2023