న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ రైల్వేస్టేషన్లో (Delhi stampede) జరిగిన తొక్కిసలాటపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రాణనష్టం జరిగినట్లు తొలుత పేర్కొన్నారు. ఆ తర్వాత దానిని ఎడిట్ చేశారు. దీంతో ప్రతిపక్షాలు ఆయనను విమర్శించాయి. కుంభమేళా వెళ్లే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో శనివారం రాత్రి ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగింది. 18 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.
కాగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ సంఘటనపై సోషల్ మీడియాలో స్పందించారు. ఈ తొక్కిసలాటలో ప్రాణనష్టం జరిగిందని, పలువురు గాయపడినట్లు తొలుత ఎక్స్‌లో పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. ఆ తర్వాత నిమిషాల్లోనే ఆ ట్వీట్‌ను ఆయన ఎడిట్ చేశారు. మరణాల ప్రస్తావన తొలగించారు. దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు.
మరోవైపు తొక్కిసలాటపై సోషల్ మీడియాలో పోస్ట్‌ను ఎల్జీ సక్సేనా ఎడిట్ చేయడంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ఈ సంఘటనను తక్కువగా చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినట్లు ఆప్ ఆరోపించింది. కేంద్రం నియమించిన ఎల్జీ తన బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఇలా చేశారని విమర్శించింది. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఎల్జీ తీరును తప్పుపట్టారు.
ये केंद्र सरकार द्वारा नियुक्त दिल्ली के LG वीके सक्सेना हैं। BJP की केंद्र सरकार और इनके ऊपर दिल्ली के करोड़ों लोगों के सुरक्षा आदि की जिम्मेदारी है। अपनी जिम्मेदारी से भागने में ये कितने माहिर हैं, इसका सबूत इनका यह ट्वीट है।
नई दिल्ली रेलवे स्टेशन पर हुई दुखद घटना के बाद… pic.twitter.com/D3RjKjj8yL
— AAP (@AamAadmiParty) February 16, 2025