న్యూఢిల్లీ, మే 9: లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఎన్ఎస్ రాజా సుబ్రమణి తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)గా శనివారం నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఆయన సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏడాది మే 30న సీడీఎస్‌గా తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్న జనరల్ అనిల్ చౌహాన్ స్థానంలో ఈ మాజీ సైనికాధికారి బాధ్యతలు స్వీకరిస్తారు.
లెఫ్టినెంట్ జనరల్ సుబ్రమణి ప్రస్తుతం జాతీయ భద్రతా మండలి సచివాలయం(ఎన్ఎస్సీఎస్)లో సైనిక సలహాదారుగా పనిచేస్తున్నారు. ఆయన నిరుడు జూలై 31న ఆర్మీ వైస్ చీఫ్(వీసీఓఏఎస్)గా సైన్యం నుండి పదవీ విరమణ చేశారు. భారత సైన్యంలో 39 ఏండ్లు వివిధ హోదాల్లో పనిచేశారు.