Gas Cylinder Price | సామాన్యుడిపై కేంద్రం పిడుగు.. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై 50 వడ్డింపు
పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ఇప్పటికే కుదేలైన పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్రంలోని మోదీ సర్కారు మరో పిడుగు వేసింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 50 పెంచింది. ఈ మేరకు సోమవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు.
- ఉజ్వల స్కీమ్ లబ్ధిదార్లకూ దక్కని మినహాయింపు
- సీఎన్జీపైనా రూ.1 పెంపు
- పదకొండేండ్లలో 130.57 శాతం పెరిగిన వంటగ్యాస్ ధర
Gas Cylinder Price | హైదరాబాద్, ఏప్రిల్ 7 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ఇప్పటికే కుదేలైన పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్రంలోని మోదీ సర్కారు మరో పిడుగు వేసింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 50 పెంచింది. ఈ మేరకు సోమవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. నాన్ సబ్సిడీ వినియోగదారులతో పాటు సబ్సిడీ గ్యాస్ అందుకొంటున్న ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని మంత్రి తెలిపారు. తాజా పెంపుతో తెలుగు రాష్ర్టాల్లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 920 వరకూ చేరినట్టు పలువురు వినియోగదారులు మండిపడుతున్నారు.
సీఎన్జీపై రూ.1 పెంపు
కిలో సీఎన్జీపై రూ. 1 పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతవారం ఇన్పుట్ సహజ వాయువు ధరలను ప్రభుత్వం దాదాపు 4 శాతం పెంచిన నేపథ్యంలో తాజాగా సీఎన్జీ ధరలను కిలోకు రూ.1 చొప్పున పెంచింది. ఇది దేశ రాజధానితోపాటు ఇతర నగరాలకు వర్తిస్తుంది. ఢిల్లీలో కిలో సిఎన్జీ ధర రూ. 75.09కి చేరుకుందని నగరానికి చెందిన గ్యాస్ రిటైలర్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఎక్స్ వేదికగా తెలిపింది.
పదకొండేండ్లూ భారమే
2014లో మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వంటగ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 2014లో రూ. 399గా ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర.. తాజా పెంపుతో రూ. 920కు చేరింది. అంటే పదకొండేండ్ల వ్యవధిలో గ్యాస్ ధరలు ఏకంగా 130. 57 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ ముడిచమురు ధర నాలుగేండ్ల కనిష్ఠానికి చేరినప్పటికీ, దేశీయంగా ఇంధన ధరలను మాత్రం కేంద్రంలోని ఎన్డీయే సర్కారు సవరించకపోగా గ్యాస్ ధరలను పెంచింది. దీంతో కేంద్ర సర్కారు వైఖరిపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

