న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. ఒక్కో సిలిండర్‌పై రూ.62 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్ ధరను వరుసగా నాలుగో నెల పెంచారు.
తాజా పెంపుతో చెన్నైలో దీని ధర రూ.1964.50కి చేరుకుంది. గత నాలుగు నెలల కాలంలో ఈ సిలిండర్ ధర రూ.156 మేర పెరిగింది. మరోవైపు విమాన ఇంధన ధరను కూడా చమురు సంస్థలు 3.3 శాతం మేర పెంచాయి. తాజా పెంపుతో ఢిల్లీలో ఏటీఎఫ్ కిలో లీటర్ ధర రూ.90,538.72కు చేరుకుంది.