న్యూఢిల్లీ, నవంబర్ 1: ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఎల్పీజీ వాణిజ్య సిలిండర్(19కిలోలు) ధరను కేవలం ఐదు రూపాయలు తగ్గించాయి. ఢిల్లీలో ప్రస్తుతం దీని ధర రూ.1595 కాగా, నవంబర్ 1 నుంచి రూ.1590గా నిర్ణయించింది. రెస్టారెంట్స్, హోటల్స్, క్యాటరింగ్ సర్వీసెస్.. సహా వివిధ వ్యాపారాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్నే వాడుతున్నారు. ఈ కేటగిరిలో వినియోగదారులకు గృహ వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీ వర్తించదు. కాగా, నవంబర్ 1 నుంచి సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో చమురు మార్కెటింగ్ సంస్థలు ఎలాంటి మార్పులూ చేయలేదు.